మెదక్: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

మెదక్ (CLiC2NEWS): జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని శివ్వం పేట మండలం ఉసిరికపల్లి వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రహదారిపై గుంతల కారణంగా కారు అదుపుతప్పి కల్వర్డును ఢీకొట్టి, ఎగిరి పక్కనే ఉన్న ఉన్న కాల్వలో పడింది. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఏడుగరు మృతి చెందారు.