ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

ములుగు (CLiC2NEWS): జిల్లాలోని ఎర్రిగ‌ట్ట‌మ్మ వ‌ద్ద ఆటో ప్ర‌మాదానికి గురైంది. ఆటోను డిసిఎం వ్యాను ఢీకొన్నాయి.  ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించారు. మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని వ‌రంగ‌ల్ ఎంజిఎం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతిచెందిన వారు మంగ‌పేట మండ‌లం కోమ‌టిప‌ల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం ష‌రీఫ్ ద‌ర్గాకు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈప్ర‌మాదం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.