నెల్లూరు జిల్లాలో లారీ ఢీకొని నలుగురు కార్మికులు మృతి
గుడ్లూరు (CLiC2NEWS): నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి మధ్యలోని గ్రీనరీని కట్ చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. వీరంతా మన్నేటికోట, బాగల్లు సింగరాయకొండ ప్రాంత వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.