నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నిజామాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ముప్కాల్ బైపాస్‌పై కారు ప్రామాదానికి గురైంది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగరు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి నిర్మల్‌కు వెళ్తుండుగా కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్నవారు హైదరాబాద్ వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.