ఎప్ సెట్ రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువతులు మృతి

నిజామాబాద్ (CLiC2NEWS): ఎప్ సెట్ పరీక్షకు హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్ వద్ద చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం లో తర్య తండాకు చెందిన అశ్విని, మంజుల ఆక్కాచెల్లెళ్లు. వీరు హైదరాబాద్‌లో శుక్రవారం ఎప్‌సెట్ రాసి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.