పుణెలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ యువకులు మృతి

పుణె (CLiC2NEWS): శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యవకులు మృత్యువాత పడ్డారు. అజ్‌మేర్ దర్గాకు వెళ్లిన తెలంగాణ యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయిపోయింది. ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించారు. వీరు సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజవర్గానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది.