రోడ్డు ప్రమాదంలో ఎస్ ఐ మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం ఎస్ ఐ రాఘవేందర్ గౌడ్ మృతిచెందారు. రాఘవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ జిఆర్పీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన సికింద్రాబాద్ జిఆర్‌పిలో ఎస్ ఐగా పనిచేశారు. ఇటీవల ఆయన బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లారు.