సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

సికింద్రాబాద్ (CLiC2NEWS): మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బన్సీలాల్ పేట్‌కు చెందిన హర్షిత్, ప్రణయ్.. ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మహంకాళి పిఎస్ పరిధిలని ఎస్డి రోడ్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్ చౌరస్తా వద్ద వీరి బైక్ స్విప్ట్ డిజైర్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షిత్ ఆస్పత్రికి తరలించే మార్గంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.