యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి
కాన్పూర్ (CLiC2NEWS): యుపిలోని కాన్పూర్లో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఘతంపుర్ ప్రాంతంలో అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. బాధితులంతా చంద్రికాదేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి సొంతురు కోర్తాకు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 50 మంది వరకు భక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది గాయపడ్డారు. వీరిని స్థానికుల సాయంతో పోలీసులు ఆసుప్రతికి తరలించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సిఎం యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.