వైఎస్ ఆర్ జిల్లాలో ప్రమాదానికి గురైన తుఫాన్ వాహనం.. ఏడుగురు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/ROAD-ACCIDENT-IN-YSR-DT.jpg)
వైఎస్ఆర్ (కడప) (CLiC2NEWS): జిల్లాలో దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో ఏటూరు గ్రామానికి సమీపంలో లారీ.. వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం.
వారంతా అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి.. తిరిగు ప్రయాణంలో వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.