ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ద్వారకాతిరుమల (CLiC2NEWS): హైదరాబాద్ నుండి రాజవోలుకు వస్తున్న కారు ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం ప్రమాదానికి గురైంది. కారు ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్నది తూర్పుగోదావరి రాజవోలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రాచబత్తుని భాగ్యశ్రీ హైదరాబాద్‌లోని ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గాత్రులను ఏలూరిలోని ఆస్పత్రికి తరలించారు.