న‌గ‌ర శివారులో కుమార్తె స‌హా దంప‌తుల దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌ర శివారులో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళుతున్న కుటుంబం ఆదివారం సాయంత్రం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో కుమార్తె స‌హా దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల‌ కుమారుడికి తీవ్ర‌గాయాలైయ్యాయి. ఈ విషాద‌క ఘ‌ట‌న మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కండ్ల‌కోయ‌-మేడ్చ‌ల్ మార్గంలో చోటుచేసుకుంది. వెనుక నుండి దూసుకొచ్చిన లారీ ఢీకొని ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా..కుమారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

ఎపిలోని కాకినాడ జిల్లాకు కొత్త య‌ర్ర‌వ‌రం గ్రామానికి చెందిన సాగి బుల్లెబ్బాయి కుటుంబం న‌గ‌రంలోని ఉప్ప‌ల్‌లో నివాసం ఉంటుంది. అత‌నికి భార్య‌, కూతురు,కుమారుడు ఉన్నారు. త‌న చిన్న‌నాటి స్నేహితుడి భార్య ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదానికి గురై గాయ‌ప‌డ్డారు. ఆమెను ప‌రామ‌ర్శించేందుకు బుల్లెబ్బాయి కుటుంబం మేడ్చ‌ల్ మండ‌లం ఎల్లంపేటకు బ‌య‌లు దేరారు. మేడ్చ‌ల్ చెక్‌పోస్ట్ స‌మీపంలో వీరు ప్ర‌మాదానికి గుర‌య్యారు. లారీ డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.