Nizamabad: గురుకుల పాఠశాల సమీపంలో కారు బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి

నిజామాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ దాస్‌నగర్‌లో ఉన్న బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు వేగం దూసుకొచ్చి ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సెలవురోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడేందుకు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. తమ పిల్లలతో కలిసి నడుస్తూ ఉన్న సమయంలో ఓ కారు రోడ్డుపై వారిపైకి దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం దాస్‌నగర్ గురుకుల పాఠశాల వద్ద చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు.