RRR: ఆర్ఆర్ఆర్ గర్జన.. మేకింగ్ వీడియో అదుర్స్
అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు
హైదరాబాద్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. గురువారం ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూస్తేంటే ఆర్ఆర్ఆర్ చిత్రం నభూతో నభవిష్యత్ అన్న చందాన తెరకెక్కినట్టు అర్ధమవుతుంది. హాలీవుడ్ రేంజ్లో జక్కన్న సన్నివేశాలని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. చరణ్, తారక్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను ఇందులో చూపించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు అలా.. రుచి చూపించారు.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. చరణ్‌కి జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ సందడి చేయనున్నారు. అలాగే తారక్ ప్రేయసిగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.