Punjab National Bank: రూ. 18 కోట్ల చోరీ!

ఇంఫాల్ (CLiC2NEWS): ఓ బ్యాంకులో చొర‌బ‌డిన‌ దుండ‌గులు తుపాకుల‌తో బెదిరించి ఏకంగా రూ. 18 కోట్లు దోచుకెళ్లారు. ఈ ఘ‌ట‌న మ‌ణిపుర్‌లోని ఉఖ్‌రుల్‌లో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు శాఖ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు 10 దుండ‌గులు బ్యాంకులోకి చొర‌బ‌డి రూ. 18.80 కోట్లు దోచుకున్నారు. ముఖాలకు ముసుగు వేసుకొని సుమారు 10 మంది దుండ‌గులు బ్యాంకులోకి చొర‌బ‌డ్డారు. బ్యాంకులో విధులు నిర్వ‌హిస్తున్న వారిని తుపాకుల‌తో బెదిరించి టాయిలెట్ల‌లో బందించారు. మ‌రో ఉద్యోగిన బెదిరించి, లాక‌ర్ తెరిపించి న‌గ‌దును దోచుకెళ్లిన‌ట్లు సిసిటివి పుటేజిల ద్వారా తెలుస్తుంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆ జిల్లాలోని బ్యాంకులు, ఎటిఎంల‌కు న‌గ‌దును త‌ల‌ర‌లించ‌డానికి ఆర్‌బిఐ ఈ శాఖ‌లోనే న‌గ‌దును నిల్వ‌చేస్తుంద‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.