ఎన్టిఆర్-జాన్వీ: ‘దేవర’ చిత్రం నుండి రొమాంటిక్ సాంగ్..
హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్టిఆర్ , జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లోని ఎన్టిఆర్-జాన్విల రొమాంటిక్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. చుట్టమల్లె చుట్టేస్తోంది తుంటరి చూపు.. అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సమకూర్చారు. అనిరుధ్ సంగీతం అందించగా.. శిల్పారావ్ గాత్రం అందించారు.