రోశ‌య్య అంత్య‌క్రియ‌లు

హైద‌రాబాద్‌(CLiC2NEWS) : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ మాజి ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య అంతిమ‌యాత్ర కొన‌సాగుతోంది. ఆయ‌న పార్థివ దేహాన్ని అమీర్‌పేట్ లోని స్వ‌గృహం నుండి గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌జ‌లు, అభిమ‌నాల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. రోశ‌య్య పార్థివ దేహానికి ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్ర‌స్ నేత‌లు, సినీ ప్ర‌ముఖులు నివాళులర్పించారు. త‌ద‌నంత‌రం గాంధీభ‌వ‌న్ నుండి దేవ‌ర‌యాంజాల్ ఫాంహౌస్‌లో రోశ‌య్య అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.