జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. నలుగురు మృతి

ముంబయి (CLiC2NEWS): జైపుర్ నుండి ముంబయి వెళ్తున్న రైల్లో ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సీనియర్ ఎఎస్ ఐ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘర్ స్టేషన్ సమీపంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన సీనియర్ అధికారి ఎఎస్ ఐ టికారామ్ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోని ముగ్గురు ప్రయాణికులపై కూడా కాల్పులు జరిపి .. స్టేషన్ రాగానే పారిపోవడానికి ప్రయత్నించాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన చేతన్ క్షణికావేశంలో సీనియర్ అధికారిని కాల్చి.. తర్వాత కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయినట్లు తెలిపారు. కానిస్టేబుల్‌కి షార్ట్ టెంపర్ అని.. అతనికి తొందరగా కోపం వస్తుందని, ఆసమయంలో పెద్ద గొడవ జరగకలేదన్నారు. రైళ్లలో భద్రత కోసం ఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎస్కార్ట్ డ్యూటిలో విధులు నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది.