RRB: నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3693 పోస్టులు

RRB: ఇంటర్మీడియట్‌తో భారతీయ రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ (ఎన్‌టిపిసి) కేటగిరీలో 3693 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎన్‌టిపిసి ఇంటర్‌లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ – 2022, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ – 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ -990, ట్రెయిన్స్ క్లర్క్- 72, పోస్టులు ఉన్నాయి. వీటిలో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ పోస్టులకు లెవెల్-3 జీతం అందుతుంది. మూలవేతనం రూ. 21,700 .. అన్ని కలిపి రూ. 40వేలు అందుతుంది. మిగిలినవి లెవెల్ -2 పోస్టులకు జీతం రూ. 19,900 ఉంటుంది.. అన్ని కలిపి రూ. 36వేలు అందుకోవచ్చు.
వయస్సు జనవరి 1వ తేదీ నాటికి 18 నుండి 33 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరి ప్రకారం 10-15 ఏళ్లు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. టైపిస్ట్ ( అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్) పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ ఈ నెల 27గా నిర్ణయించారు. మహిళలు, ఎస్‌టి, ఎస్‌సి , ట్రాన్స్ జండర్, ఇబిసిలకు ఫీజు రూ. 250. ఇతర వర్గాల వారికి ఫీజు రూ.500 గా ఉంది. వీరు సిబిటి కి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనెక్కి ఇస్తారు. పూర్తి వివరాలకు www.rrbapply.gov.in/#.auth/landing వెబ్‌సైట్ చూడగలరు