తెలుగు మాధ్య‌మంలోనూ ఆర్ఆర్‌బి ప‌రీక్ష‌.. లెవెల్‌-1 ఖాళీలు 32,438

రైల్వే డిపార్ట్‌మెంట్  లెవెల్-1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. టెన్త్ , ఐటిఐ, అప్రెంటిస్ (ఎన్‌సివిటి జారీ చేసిన నేష‌న‌ల్ అప్రెంటిస్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎసి)).. ఏ అర్హ‌త‌తోనైనా ఆర్ ఆర్‌బిలో ఉద్యోగం సంపాదించ‌వ‌చ్చు.  ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఫిబ్ర‌వ‌రి 22లోపు పంపించాల్సి ఉంది. లెవెల్‌-1 ఖాళీలు 32,438 ఉన్నాయి. ఈ ప‌రీక్ష‌ను తెలుగు మాధ్యమంలోనూ రాసుకునే అవ‌కాశం ఉంది.

ఎంపికైన వారికి వేత‌నం రూ.18వేలు, డిఎ, హెచ్ ఆర్ె, ఇత‌ర అల‌వెన్సుల‌తో మొద‌టి నెలే దాదాపు రూ.35వేలు వ‌ర‌కు అందుతుంది.  ఆన్‌లైన్ ప‌రీక్ష , ఫిజిక‌ల్ టెస్టులు, ధ్ర‌వ‌ప‌త్రాల ప‌రిశీల‌న , మెడిక‌ల్ టెస్టుల‌తో నియామ‌కాలు చేప‌డ‌తారు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు జ‌న‌వ‌రి 1, 2025 నాటికి 18-36 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష   వంద మార్కుల ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. కాల వ్య‌వ‌ధి 90 నిమిషాలు. జ‌న‌ర‌ల్ సైన్స్ 25, మ్యాథ‌మెటిక్స్ 25, జ‌న‌ర‌ల్ ఇంట‌లిజెన్స్ అండ్ రీజ‌నింగ్ 30, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ క‌రెంట్ ఆఫైర్స్ లో 20 అబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఉంటాయి. త‌ప్పు స‌మాధానానికి 1/3 వంతు మార్కులు త‌గ్గిస్తారు. అభ్య‌ర్థులు తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌ను వ‌దిలేయడం మంచింది.

ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సి టెస్ట్ (పిఇటి) ఖాళీల‌ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌ను మూడు రెట్ల‌ సంఖ్య‌లో పిఇటి టెస్ట్‌కు పిలుస్తారు. దీనిలో పురుషుల విభాగంలో 2 నిమిషాల్లో 35 కిలోల బ‌రువు ఉన్న ఇసుక బ‌స్తాను దించ‌కుండా 100 మీట‌ర్లు మోసుకెళ్లాలి. ఇది స‌క్సెస్ అయితే.. కిలోమీట‌ర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెక‌న్ల‌లో చేరుకోవాలి.

మ‌హిళ విభాగంలో 20 కిలోల బ‌రువున్న ఇసుక బ‌స్తాను 2 నిమిషాల్లో 100 మీట‌ర్ల దూరం దించ‌కుండా తీసుకెళ్లాలి .ఇ ది అధిగ‌మిస‌త్ఏ కిలో మీట‌ర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెక‌న్ల‌లో చేరుకోవాల్సి ఉంటుంది.

పిఇటి ప‌రీక్ష నెగ్గిన వారి జాబితా నుండి విభాగాల వారీగా   ప‌రీక్ష‌ల్లో ఎక్కువ మార్కులు పొందిన వారి  ధ్ర‌వ‌ప‌త్రాలు ప‌రిశీలిస్తారు. అనంత‌రం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 500.. ప‌రీక్ష‌కు హాజ‌రైతే బ్యాంకు ఛార్జీలు మిన‌హాయించి మిగిలిన‌వి వెన‌క్కి ఇస్తారు. ఎస్‌సి, ఎస్‌టి, మ‌హిళ‌ల‌కు , ట్రాన్స్ జెండ‌ర్‌, ఇబిసిల‌కు రూ.250.. పీర‌క్ష‌కు హాజ‌రైన‌వారికి బ్యాంకు ఛార్జీలు మిన‌హాయించి మిగిలిన ఫీజు వెనక్కి ఇస్తారు.

సిల‌బ‌స్‌, పరీక్ష తేదీలు, పోస్టుల వివ‌రాలు త‌దిత‌ర అంశాల పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.rrbapply.gov.inవెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.