ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల వాయిదా!

 

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ట్రిపుల్ ఆర్ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. సినీ ప్రేక్ష‌కులంతాఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుద‌ల వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈచిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌యిన విష‌యం తెలిసిన‌దే. క‌రోనా కార‌ణంగా దేశంలో ప‌లు రాష్ట్రాలలో థియేటర్లు మూత ప‌డ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కార‌ణంగా ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌లు విధించాయి. నైట్ క‌ర్ఫ్యూతో పాటు 50% ఆక్య‌పెన్సీతోనే థియేట‌ర్లు న‌డ‌పాల‌ని నిబంధ‌న విధించారు.

Leave A Reply

Your email address will not be published.