ఆర్ ఆర్ ఆర్ : ‘నాటు నాటు’ పుల్ వీడియో సాంగ్ రిలీజ్

హైదరాబాద్ (CLiC2NEWS): ;ఆర్ఆర్ఆర్’ చిత్రం నుండి ‘నాటు నాటు..’ పూర్తి వీడియో సాంగ్ రిలీజయింది. ఈ సినిమా విడుదలైన నాటినుండి బాక్సాఫీసు రికార్డులు సృష్టిస్తుంది. నాటు నాటు లిరికల్ సాంగ్ విడుదలైన క్షణం నుండి సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసినదే. తాజాగా చిత్ర బృందం ఈ సాంగ్ పుల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పాటలో ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్‌కు ప్రేక్షలకు క్లాప్స్ కొట్టాల్సిందే . ఈ పాటలో కథానాయిక ఒలివియా మోరిస్ కూడా స్టెప్పులేసి సందడి చేసింది.
చంద్రబోస్ రచించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం రూ. 1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.