RRR: కొత్త అప్‌డేట్‌.. స్టెప్పులతో అదరగొడుతున్న తారక్.. చరణ్

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన ప్రాత్రలలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్రప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే తొలి గీతం (దోస్తీ), గ్లింప్స్‌తో ఈ ప్రాజెక్టు సత్తాను ప్రేక్షకులకు రుచి చూపించిన టీమ్‌ తాజాగా సెకండ్‌ సింగిల్‌ (రెండో పాట) అప్‌డేట్‌ని అందించింది. ‘నాటు నాటు’ అంటూ సాగే హుషారైన పాటను నవంబర్‌ 10న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఈ పాటను బ్లాస్టింగ్ బీట్స్, హైవోల్జేజ్ డ్యాన్స్ నంబర్ అని మేకర్స్ తెలిపారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.

ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ని బట్టి చూస్తుంటే ఈ పాట పూర్తిస్థాయి మాస్‌ బీట్‌ అనిపిస్తోంది. ఈసందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో చెర్రీ, తారక్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు. 1920కు తగ్గట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.