RRR: `నాటు నాటు`కు ఆస్కార్

హైదరాబాద్ (CLiC2NEWS): భారతీయ చలన చిత్ర చరిత్రలో మరపురాని ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయులందరి ఎదురు చూపులకు తెరదించుతూ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు పట్టేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ పాటలను వెనక్కి నెట్టి తెలుగు పాట విశ్వవేదికపై విజేతగా అవతరించింది. లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన `ఆప్లాజ్ (టెల్ ఇట్ ఏ ఉమెన్), `లిఫ్ట్ మి ఆప్` (బ్లాక్ ఫాంథర్- వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), `హోల్డ్ మై హ్యాండ్` (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెన్కి నెట్టి టాలీవుడ్ సినిమాలో 'RRR'
.. సినిమాలోని `నాటు నాటు` కు ఆస్కార్ ద్కించుకుంది.
లాస్ ఏంజెల్స్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంఘ్ కేటగిరిలో `నాటు నాటు` ప్రకటించగానే డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అందుకున్న RRR టీమ్ ఆనందోత్సాహా్ల్లో మునిగిపోయింది. అంతకు ముందు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనతో వేదిక దద్దరిల్లిపోయింది.
ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. ప్రపంచ వ్యాప్తం వేలాదిమందితో వేయించిన స్టెప్పులను ఫ్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.