RRR: ఎమోషన్స్‌తో సాగిన `జనని` సాంగ్ వచ్చేసింది..

హైదరాబాద్ (CLiC2NEWS): జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. దానిలో భాగంగా సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం మరో కానుక అందించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్‌ఆర్ సోల్ యాంథమ్ ‘జనని’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. కీరవాణి కంపోజ్ చేసిన ఈపాట ఆర్‌ఆర్‌ఆర్ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ‘జనని’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ ఎక్స్‌ప్రెషన్స్ ఉద్వేగభరితంగా ఉన్నాయి.