‘ఆర్‌ఆర్‌ఆర్’ థియేటరికల్ ట్రైలర్ వాయిదా..

హైదరాబాద్(CLiC2NEWS): రాజమౌళి దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ థియేటరికల్ ట్రైలర్ వాయిదా పడిందని చిత్రబృందం తెలిపింది. రామ్ చరణ్, ఎన్‌టిఆర్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ట్రైలర్ ఈనెల 3వ తేదీన విడుదల చేయునున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో పాటు మరికొన్ని అనుకోని కారణాల వలన ట్రైటర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించారు. వీలేనంత త్వరలో ట్రైటర్ విడుదల తీదీని ప్రటిస్తామని తెలియజేశారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.