డిగ్రీ పూర్త‌యితే నెల‌కు రూ.10వేలు.. మ‌హారాష్ట్ర స‌ర్కార్‌

ముంబయి (CLiC2NEWS): డిగ్రీ / పిజి పూర్త‌యిన వారికి రూ. 10 వేలు చొప్పున స్ట‌యిఫండ్ చెల్లించే విధంగా కొత్త స్కీమ్‌ను ప్ర‌క‌టించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. శిండే స‌ర్కారు నిరుద్యోగ యువ‌త కోసం ముఖ్య‌మంత్రి యువ కార్య ప్ర‌శిక్ష‌ణ యోజ‌న పేరుతో కొత్త ప‌థ‌కం తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం నిరుద్యోగ యువ‌త‌కు వారి విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి ప్ర‌తినెలా బ్యాంకు అకౌంట్ల‌లో స్ట‌యిఫండ్‌ను జ‌మ చేయ‌నున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో మ‌హారాష్ట్ర అపెంబ్లీ ఎన్నిక‌ల జ‌ర‌గనున్నాయి.

ఈ ప‌థ‌కం కింద 12వ త‌ర‌గ‌తి పాసైన వారికి నెల‌కు రూ.6వేలు.. ఐటిఐ/ డిప్లొమా పూర్తి చేసిన వారిక రూ. 8వేలు, డిగ్రీ/పిజి పూర్తి చేసిన వారికి రూ. 10 వేలు చొప్పున స్ట‌యిఫండ్ చెల్లించ‌నున్నారు. 18-35 ఏళ్లు వ‌య‌సు గ‌ల నిరుద్యోగులు ఈ ప‌థ‌కానికి అర్హులు. ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ పొంద‌డంతో పాటు ప‌రిశ్ర‌మ అవ‌స‌రాల‌కు యువ‌త‌ను సిద్ధం చేయ‌డం ఈ ప‌థ‌కం యొక్క ముఖ్య ఉద్దేశ‌మ‌ని స‌ర్కార్‌ ప్ర‌క‌టించింది. ఆరు నెల‌ల ఇంట‌ర్న్‌షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు జ‌మచేస్తారు.

Leave A Reply

Your email address will not be published.