గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గింపు… ప్రధాని మోదీ

ఢిల్లీ (CLiC2NEWS): మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు శుభవార్తనందించారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం రక్షాబంధన్ సందర్బంగా సిలిండర్ ధర రూ. 200 తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే ఉజ్వల యోజన కింద ఎల్‌పిజి సిలిండర్‌పై అందిస్తున్న రూ. 300 రాయితీని వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.