చిరువ్యాపారులకు జగనన్న తోడు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Jagnanna-todu-scheeme.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న తోడు ఏడోవిడత నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపాలరులకు చేయూతనందించేందుకు చేపట్టిన జగనన్న తోడు పథకం ద్వారా 15 లక్షల మందికిపైగా రుణాలు అంజేశారు. వీరిలో 13 లక్షల మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు కూడా పొందారన్నారు. ఇపుడు ఏడో విడతలో 5 లక్షల మందికి పైగా రుణాలు అందజేయనున్నారు. వీరిలో 4.54 లక్షల మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించనవారే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరో 56 వేల మందికి తొలిసారి ఈ రుణాలు తీసుకోనున్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా మొదటి విడతో రూ. 10వేలు రుణం అందజేస్తారు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే.. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి రుణాలు అందిస్తారు. మొదటి విడతలో రూ. 10వేలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రెండో విడత రూ. 11 వేలు .. ఇది కూడా సకాలంలో చెల్లించిన వారికి మూడో విడత రూ. 12 వేలు .. ఇలా ప్రతి ఏటా ఓ వెయ్యి పెంచుతూ రుణాలు అందజేస్తారు. అంతేకాకుండా తీసుకన్నా రుణం తిరిగి చెల్లిస్తే.. వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది.