వేములవాడ అభివృద్ధికి రూ.127కోట్లు మంజూరు
హైదరాబాద్ (CLiC2NEWS): వేములవాడలో అభివృద్ధి పనులకు రాష్ట్ర సర్కార్ రూ.127.65కోట్లు మంజూరు చేసింది. రాజన్న ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు రూ. 76 కోట్లు కేటాయించారు. ఆలయం నుండి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణకు రూ. 47.85 కోట్లు .. బతుకమ్మల తెప్ప నుండి జగిత్యాల వరకు డ్రైనేజి నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించినట్లు సమాచారం.