రాయపర్తిలో బ్యాంకు లాకర్ కోసి రూ.15 కోట్ల బంగారం చోరీ

రాయపర్తి (CLiC2NEWS): బ్యాంకు లాకర్‌లను కట్టర్ కట్‌చేసి, రూ.15 కోట్ల విలువైన దాదాపు 19 కేజీల బంగారంను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంకులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు వద్ద కాపలాదారుడు లేని సమయంలో దుండగులు బ్యాంకు కిటికీని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ముందుగా సిసి కెమెరాల వైర్లు తొలగించి లాకర్లను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. లాకర్లలో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన 497 బంగారం ఆభరణాల ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో రూ14.94కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. చోరీ గురించి తెలుసుకున్న బ్యాంకు ఖాతాదారులు ఆందోళనతో బ్యాంకు వద్దకు చేరుకోగా.. నష్టం జరగకుండా చూస్తామని అధికారులు నచ్చజెప్పి పంపించారు.
[…] రాయపర్తిలో బ్యాంకు లాకర్ కోసి రూ.15… […]