స‌ర‌స్సులో క‌రెన్సీ నోట్ల క‌ట్ట‌లు.. అన్నీ రూ.2వేల నోట్లే!

అజ్మేర్ (CLiC2NEWS): ఓ స‌ర‌స్సులో రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు ఉన్న క‌వ‌ర్‌ కొట్టుకురావ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. రాజ‌స్థాన్‌లోని ఓ స‌ర‌స్సులో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పాలిథిన్ క‌వ‌ర్లో క‌రెన్సీ క‌ట్ట‌ల్ని నీటిలోకి విసిరేయ‌డంతో అజ్మేర్‌లోని అనాసాగ‌ర్ స‌ర‌స్సులో తేలియాడుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న కొంద‌రు స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీస‌లు క‌రెన్సీని స్వాధీనం చేసుకొన్నారు. క‌రెన్సీ క‌ట్ట‌ల‌న్నీ రూ.2వేల నోట్ల‌ని తెలిపారు. కానీ అవ‌న్నీ త‌డిసిపోవ‌డంతో లెక్కించ‌డం కుద‌ర‌లేద‌ని, నోట్ల‌న్నీ ఆరిన త‌ర్వాత లెల‌క్కించున్న‌ట్లు అనాసాగ‌ర్ ఎస్పీ తెలిపారు. గ‌తేడాది జూన్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. అనాసాగ‌ర్ స‌రస్సు ప్రాంతంలో రామ‌ప్ర‌సాద్ ఘాట్ వద్ద రూ. 200, రూ. 500 నోట్ల‌తో కూడిన సంచులు కొట్టుకురావ‌డంతో.. అప్ప‌ట్లో స్థానికులు ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా నీటిలోకి దూకి డ‌బ్బుల కోసం ఎగ‌బ‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.