మంత్రి కెటిఆర్ దావోస్ ప‌ర్య‌ట‌న‌.. తెలంగాణ‌కు రూ. 21వేల కోట్ల పెట్టుబ‌డులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్ దావోస్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు రూ. 21వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ప్ర‌పంచ ఆర్ధిక వేదిక స‌ద‌స్సులో భాగంగా నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 52 వాణిజ్య స‌మావేశాలు, ఆరు రౌండ్ టేబుల్ స‌మావేశాలు, రెండు ప్యాన‌ల్ డిస్క‌ష‌న్ల‌లో ఆయ‌న పాల్గొన్న‌ట్లు తెలిపారు. ప‌లు దిగ్గ‌జ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయ‌ని.. మొత్తంగా రాష్ట్రానికి రూ. 21వేల కోట్ల పెట్టుబడులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.