నిషేధిత ఆల్ప్రాజోలం అమ్మి రూ. 23 కోట్ల ఆస్తుల ఆర్జ‌న‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌త్తుమందులు అమ్మడం ద్వారా ఆర్జించిన రూ. 23 కోట్ల ఆస్తుల‌ను టిఎస్‌న్యాబ్ అధికారులు జ‌ప్తుచేశారు. గ‌త ఏడాది 25వ తేదీన కామారెడ్డి కి చెందిన ర‌మేశ్ (అబ్కారి శాఖ‌లో కానిస్టేబుల్‌), రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన గుండుమ‌ల్ల వెంక‌ల‌య్య‌లు 2 కిలోల ఆల్ప్రా జోలం అమ్ముతుండ‌గా షాద్‌న‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్ద‌రూ   కూడ‌బెట్టిన దాదాపు రూ. 23 కోట్ల ఆస్తిని తెలంగాణ రాష్ట్ర యాంటి నార్కొటిక్స్ బ్యూరో (టిఎస్‌న్యాబ్‌)అధికారులు, పోలీసులు జ‌ప్తుచేశారు.

వెంక‌ట‌య్య‌కు షాద్‌న‌గ‌ర్‌లో 866.66 గ‌జాల నాలుగు ఓపెన్ ప్లాట్లు,  షాద్‌న‌గ‌ర్ మండ‌లంలో 21.28 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి, షాబాద్ మండ‌లంలో 13.04 ఎక‌రాల వ్య‌య‌సాయ భూమి, త‌న భార్య పేరుమీద కొన్న 2.22 ఎక‌రాల భూమి, బ్యాంకు ఖాతాలో రూ. 4,24చ,990 ల న‌గ‌దు ఉన్నాయి. ర‌మేశ్‌కు ఒక మారుతి స‌వ్ఇస్ట్ కారు, కామారెడ్డి బ్యాంక్ ఖాతాలో రూ. 2,21,191 న‌గ‌దు ఉంది. మ‌త్తుమంద‌లు కేసులో ఇంత భారీ మొత్తంలో నిందితులు ఆస్తులుజ‌ప్తు చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం

 

Leave A Reply

Your email address will not be published.