కర్ణాటక ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ హామీల వర్షం..
లీటర్ డీజిల్‌పై రూ.25 రాయితీ.. రూ. 10 లక్షల బీమా సౌకర్యం..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/RAHUL-GANDHI.jpg)
ఉడుపి (CLiC2NEWS): కర్ణాటకలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతూ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఉడపి జిల్లాలో మత్స్య కారుతలతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించి.. వారికి హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. గంగపుత్రులకు రూ. 10 లక్షల బీమీ సౌకర్యంతో పాటు వడ్డీ లేని రూ. లక్ష రుణం.. రోజుకు 500 లీటర్ల వరకు ఒక్కో లీటరు డీజిల్‌పై రూ. 25 ల చొప్పున రాయితీ అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
కర్ణాటకలో ఎన్నికల పోలంగ్ సమయం సమీసిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ ఎన్నికల ప్రాచరాన్ని కొనసాగిస్తున్నాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నాయకులు హామీలిస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ తొలి కేబినెట్ సమావేశంలోనే అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదని.. రూ. కోట్లతో ఎమ్యెల్యేలను కొనగోలు చేయడం వల్ల ఏర్పడిందన్నారు. ఏపని జరగాలన్నా కమీషన్ డిమాండ్ చేస్తున్నారని.. ప్రభుత్వ రంగ ఉద్యోగా నియామాల విషయంలో సైతం అవినీతి అక్రమాలు చోటుచోసుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని ఆరోగ్యం,విద్య వంటి వాటికి కాకుండా మిలీయనీర్లైన తమ స్ఏహితులకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.