రూ. 25 పెరిగిన వంట గ్యాస్ ధరలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.25 పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి.

  • ఈ పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.859.50కు చేరింది. ఇంతకుముందు జూలై 1న రూ.25.50 పెంచారు. ఏడాది కాలంలో మొత్తం రూ.165.50 పెరిగింది.
  • ముంబయిలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.859.5 కాగా, ఇంత‌కు ముందు రూ .834.50గా ఉంది.
  • కోల్‌కతాలో, LPG సిలిండర్ ధర రూ .861 నుండి రూ. 886 కి పెరిగింది.
  • ఇవాళ్టి నుంచి చెన్నైలో LPG సిలిండర్ ధర రూ. 875.50 కానుంది. ఈ ధ‌ర నిన్నటి వరకు రూ. 850.50గా ఉండేది.
  • హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ ధరలు రూ. 25 పెరిగి రూ.912కి పెరిగింది.
Leave A Reply

Your email address will not be published.