పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు: సిఎం రేవంత్

హైదరాబాద్ (CLiC2NEWS): పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. శనివారం శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్న సినీ హీరో చిరంజీవి, మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పద్మ పురస్కారాలను అందుకున్న వారిని సిఎం, మంత్రులు సత్కరించారు.