రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/balapur-laddu.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ లో గణేశ నిమజ్జనం దేశంలోనే పేరుగాంచింది. అందులో బాలాపూర్ లడ్డు మరీ ప్రత్యేకం. ఇవాళ (గురువారం) భక్తులంతా ఎంతో ఉత్కంఠతో ఎదరు చూస్తున్న బాలాపూర్ లడ్డు వేళంలో అత్యధిక ధర పలికింది. ఈ సారి తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్‌లో జరిగిన ఈ వేళం పాటలో మొత్తం స్థానికులు 20 మంది సహా మొత్తం 36 మంది లడ్డు కోసం పోటీ పడ్డారు. ఈ వేలం పాట కార్యక్రమంలో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగత కృష్ణారెడ్డితో పాటు పల్గొన్నారు. నిర్వాహకులు ఉత్సవ సమితి రూ. 1,116తో వేలం పాట ప్రారంభించారు.
కాగా లడ్డు వేలం పాట పూర్తి కావడంతో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వినాయకుడిని హుస్సేన్‌సాగర్ తరలిస్తున్నారు. ఈ శోభాయాత్ర చంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్, మెజాంజాహి మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ కు వరకు కొనాసాగుతుంది.
లడ్డు వేలం పాట ప్రారంభించి ఈ యేడాదికి 30 యేళ్లు..
30 ఇయర్స్ గా లడ్డు వేలం పాట కొనసాగుతోంది. తొట్టతొలిసారి ఈ వేలం పాట 1994 లో బాలాపూర్ లడ్డును వేలం లో స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి రూ. 450కి దక్కించుకున్నారు.
గతంలో వేలం జరిగిన వివరాలు