రూబి హోటల్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల ఎక్స్‌గ్నేషియా ప్రకటించిన ప్రభుత్వం
ప్రధాని నరేంద్రమోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ రూబి బైక్ షోరూమ్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 3లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. సోమవారం రాత్రి సికింద్రాబాద్ సమీపంలోని రూబి హోటల్ నందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈరోజు మరొకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని నగరంలోని అపోలో, యశోద ఆస్పత్రులలో చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. భవనం సెల్లార్‌లో వ్యాపారాలకు అనుమతి లేదు. పార్కింగ్ మాత్రమే చేయాలి. కాని ఈ భవన సెల్లార్‌లో ఎలక్ట్రిక్ బైక్ విక్రయాలు నిర్వహిస్తున్నారు. భవన యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
రూబి లగ్జరి హోటల్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.