రూ.300కే ఇంట‌ర్నెట్, కేబుల్ టివి, ఇ-ఎడ్యుకేష‌న్ సేవ‌లు .. సిఎం రేవంత్ రెడ్డి

డిల్లీ (CLiC2NEWS): నెల‌కు రూ.300కే ఇంట‌ర్నెట్, కేబుల్ టివి, ఇ-ఎడ్యుకేష‌న్ సేవ‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర టిలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో సిఎం , డిప్యూటి సిఎం భేటీ అయ్యారు. టి-పైబ‌ర్ ప్రాజెక్టుకు భార‌త్ నెట్ ఫేజ్‌-3 ప‌థ‌కంలో చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గ్రామాలు, మండ‌లాల‌కు నెట్‌వ‌ర్క్ క‌ల్పించ‌డ‌మే టి ఫైబ‌ర్ ల‌క్ష్య‌మ‌ని, 65వేల ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు జి2జి, జి2సి సేవ‌లు అందిచ‌డమే లక్ష్య‌మ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 ల‌క్ష‌ల ఇళ్ల‌కు .. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 30 ల‌క్ష‌ల గృహాల‌కు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు. టి-ఫైబ‌ర్ అమలుకు ఎన్ ఎఫ్ ఓఎన్ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని.. భార‌త్ నెట్ ప‌థ‌కాన్ని టి-ఫైబర్కు వ‌ర్తింప‌జేయాల‌న్నారు. టి-పైబ‌ర్ కు రూ. 1,779 కోట్ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాల‌ని సిఎం కోరారు.

Leave A Reply

Your email address will not be published.