ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు విడుదలయ్యాయి. రాజధాని నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ..4,285 కోట్లు విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు, ఎడిబి నిధుల నుండి 25 శాతం ఇవ్వగా.. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్న తరుణంలో 25శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సిఆర్‌డిఎ కోరింది. దీంతో కేంద్రప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది.