ఝార్ఖండ్ ఎన్నికలు.. బిజెపి మ్యానిఫెస్టో ..
రాంచి (CLiC2NEWS): ఝార్ఖండ్‌లో ఈ నెల 13,20వ తేదీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవి. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి అమిత్‌షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన సంకల్ప్ పత్ర పేరుతో బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేశారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఐదేళ్లలో 5లక్షల ఉద్యోగావకాశాలు, మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 , ఉమ్మడి పౌరస్మృతి అమలు. ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలకు రెండు దశలలో ఎన్నికల జరగనున్నాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడిస్తారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సోరెన్ ప్రభుత్వ పాలనలో అక్రమవలసదారుల సంఖ్య ఎక్కువవుతుందని.. దీంతో సంతాల్ పరగాణాలో గిరిజన జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాడానికి చట్టం తెస్తుందన్నారు. అక్రమార్కులు ఆడబిడ్డలను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి ఆడబిడ్డలకు భద్రత ఉండదన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) ప్రవేశపెడతామని, దానికి గిరిజనులను దూరంగా ఉంచుతామని అమిత్‌షా తెలిపారు.