విజయవాడ: కారులో రూ.6 కోట్లు విలువచేసే బంగారం..

విజయవాడ (CLiC2NEWS): ఎపిలో అక్రమంగా తరలిస్తున్న 11 కేజిల బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ 6.4 కోట్లు ఉంటుంది. శ్రీలంక, దుబాయ్ నుండి బంగారాన్ని తీసుకొచ్చి చైన్నై మీదుగా విజయవాడకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద విజయవాడకు వస్తున్న కారులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న 4.3 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు అభరణాలు, రూ. 1.5 విదేశీ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ. 40కోట్ల విలువైన 70 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.