కొడంగల్లో విద్యాసంస్థల నిర్మాణానికి రూ. 74 కోట్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): సిఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బిసి గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 74 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బిసి గురుకుల జూనియర్ కళాశాలకు రూ. 25 కోట్లు, బిసి గురుకుట పాఠశాలకు రూ. 23.45 కోట్లు, బొమ్మరసి పేట మండలం బురాన్పేటలో బిసి బాలికల గురుకుల పాఠశాల, కళాశాల నిర్మాణానికి రూ. 25 కోట్లు కలిపి మొత్తం రూ. 73.45 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.