మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త అందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌కు శుభ‌వార్త‌నందించింది. 2022-23 సంవ‌త్స‌రానికి గాను వ‌డ్డీలేని రుణాల కోసం రూ. 750 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ఈ నిధుల‌లో గ్రామీణ స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు రూ. 500 కోట్లు, ప‌ట్ట‌ణ సంఘాల‌కు రూ. 250 కోట్లు మంజూర‌వుతాయి. గ్రామ‌ణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్‌).. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో మెప్మా ద్వారా ఈ ప‌థ‌కం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి అమ‌ల‌వుతోంది. వ్య‌వ‌సాయం , పాడి ప‌రిశ్ర‌మ‌, వ్యాపారం కోసం మ‌హిళ‌లు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది.. వాటిని వ‌డ్డీతో
స‌హా బ్యాంకుల‌కు చెల్లిస్తున్నారు. స‌కాలంలో చెల్లించే వారికి వ‌డ్డీ మొత్తాన్ని తిరిగి ఆయా సంఘాల‌కు అందిస్తోంది. ప్ర‌స్తుతం రూ. 750 కోట్ల మొత్తాన్ని విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.