రూ. 10 వేస్తే.. ఎటిఎంలో క్లాత్ బ్యాగ్లు!
హైదరాబాద్ (CLiC2NEWS): ఎటిఎంలు కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం కోసమే అంటే పొరపాటే.. ఎటిఎంలో రూ.10 వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. నగరంలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జిహెచ్ ఎమ్సి అధికారులు ప్రైవేటు సంస్థలతో కలిసి క్లాత్ బ్యాగ్ ఎటిఎంను ఏర్పాటు చేశారు. మోవెట్, యునైటెడ్ వే హైదరాబాద్ సౌజన్యంతో బాలానగర్ పండ్ల మార్కెట్ వద్ద ఎనీ టైం కాటన్ బ్యాగ్ ను ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద వెండింగ్ మిషన్ ఏర్పాటు చేశామని యునైటెడ్ వే హైదరాబాద్ బోర్డ్ సభ్యురాలు తెలిపారు. ఈ మిషన్లను రూ. 2.5 లక్షలతో చైన్నై నుండి తీసుకొచ్చినట్లు సమాచారం.