బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా
హైదరాబాద్ (CLiC2NEWS): బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పర్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ప్రవీణ్ కుమార్ బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్‌తో సమావేశమయ్యారు.
ఇటీవల బిఆర్ ఎస్‌తో – బిఎస్‌పి పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బిజెపి దాన్ని భగ్నం చేయాలని చూస్తోందని ప్రవీణ్ అన్నారు. ఈ కుట్రలకు బయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని.. తన ప్రస్తానాన్ని ఆపనన్నారు. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటానని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.