పల్నాడు జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు.. ముగ్గురు మృతి

పల్నాడు (CLiC2NEWS): జిల్లాలో ఆర్‌టిసి బస్సుని ఆటో ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిలకలూరి పేట మండలం వేలూరు గ్రామానికి 15 మంది కూలీలు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ ఆటోను తప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఆటో బస్సుకింద పడి నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని చిలకలూరి పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.