అల్లూరి జిల్లా పాడేరు వద్ద బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/11/accident.jpg)
పాడేరు (CLiC2NEWS): అల్లూరి జిల్లాలో ఆర్‌టిసి బస్సు ప్రమాదానికి గురైంది. 45 మంది ప్రయాణికులు ఉన్న బస్సు పాడేరు ఘట్ రోడ్డులోని 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదాంలో ఇద్దరు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. విశాఖపట్నం నుండి పాడేరు వెళ్లున్న బస్సు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద అదుపు తప్పి లోయలో ఏడు పల్టీలు కొట్టి పడిపోయినట్లు సమాచారం. క్షతగాత్రలను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా కష్టపడ్డారు. బస్సు డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రహదారి పక్కన రక్షణ గోడలేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.