ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): వికారాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. జిల్లాలోని మర్పల్లి మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణానికి అతివేగమే కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.